హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు.. కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ: మంత్రి పొన్నం

by Ramesh Naini |

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది.

హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు.. కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ: మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. (Telangana High Court) తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి, శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కి పంపడం జరిగింది.. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన ఆరోపించారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అని, బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామన్నారు.

Next Story