Charminar Fire Accident: ప్రమాదాలు చెప్పిరావు.. రాజకీయం చేయొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

by Naga Rani Yarlagadda |

ప్రమాదాలు చెప్పి రావని, తాము సకాలంలోనే స్పందించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, అగ్నిప్రమాదంపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Charminar Fire Accident: ప్రమాదాలు చెప్పిరావు.. రాజకీయం చేయొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ (Charminar Gulzar House Fire Accident) వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశానుసారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాద ఘటనలో పదులసంఖ్యలో మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా అగ్నిప్రమాదం జరగ్గా.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారన్నారు.

ప్రమాదాలు చెప్పి రావని, తాము సకాలంలోనే స్పందించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, అగ్నిప్రమాదంపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధిత కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో బెంగాల్ నుంచి చుట్టాల ఇంటికి వచ్చిన వారు కూడా మరణించినట్లు చెప్పారు. నాలుగు ఉమ్మడి కుటుంబాలకు చెందిన 17 మంది మరణించారని పేర్కొన్నారు.

మృతులు అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షాలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), ఆయన భార్య సుమిత్ర (65), మున్నీ బాయ్ (72), ఇరాజ్ (2), వర్ష మోడీ (36), పంకజ్ మోడీ (45), రజిత అగర్వాల్ (36), అన్య మోడీ (12), ఇదిక మోడీ (8), ప్రతమ్ అగర్వాల్ (14), ప్రియాన్షి అగర్వాల్ (6), ప్రహ్లాద్ (70), రిషబ్ (4) లుగా గుర్తించారు.

Next Story