- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజస్వీ సూర్యపై మంత్రి పొన్నం ఫిర్యాదు.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా-పాకిస్థాన్‌తో పోల్చిన ఎంపీ తేజస్వీ సూర్య (MP Tejasvi Surya)పై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డీజీపీకి లేఖ రాసి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ లేఖపై డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) స్పందించారు. తేజస్వీ సూర్యపై ప్రస్తుతానికి కేసు పెట్టే అవకాశం లేదని, ఈ విషయంలో న్యాయపరమైన సలహా (Legal Opinion) తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్‌లో రవాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతకు సబంధించి ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. రోడ్డు భద్రతను ఒక సామాజిక బాధ్యతగా భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
గత పదేళ్లలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 1.74 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని శివధర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల గత మూడు నెలల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు 330 వరకు తగ్గాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను డిసెంబర్‌లో ప్రారంభించి, జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరింత వేగవంతం చేశామన్నారు. గ్రామాల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీ (Village Road Safety Committee)లను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాణాలకు సంబంధించిన విషయమని ఆయన కోరారు. అన్ని ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.






