- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారెవ్వా! గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ: బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్
కాంగ్రెస్ (Congress) ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. ఏనాడు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రెండు పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే.. రాజకీయం అన్నారని.. ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్ (KCR)ను కన్న కూతురురే అడుగుతుంది ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడాన్ని కవిత (Kavitha) జీర్ణించుకోలేకపోయిందని అందుకే అన్ని విషయాలను ఆమె లేఖ ద్వారా బయటపెట్టిందని అన్నారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్ (KTR)తో పాటు హరీశ్ రావు (Harish Rao) కూడా సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.






