- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఆ బాధ్యత కలెక్టర్లదే.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశం
తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ వల్ల చేసిన తప్పిదాలతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ వల్ల చేసిన తప్పిదాలతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. భూ భారతి చట్టం(Bhu Bharati Act) ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని మంగళవారం తనను కలిసిన జిల్లా కలెక్టర్ల(Telangana Collectors)ను ఆదేశించారు. కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంత్ సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భూములకు సంబంధించి రైతులు అనుభవించిన కష్టాలకు, బాధలకు విముక్తి కల్పించేలా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే రెండు నెలలు రెవెన్యూశాఖకు అత్యంత కీలకమైనవని, భూ సమస్యల పరిష్కారానికి గడువుగా నిర్ణయించిన ఆగస్టు 15 నాటికి న్యాయబద్దమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన మొదలై ఏడాదిన్నర అవుతుందని, ఎవరూ ఊహించని రీతిలో భూ సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమం అభివృద్ది పధకాలను ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. ప్రభుత్వం రూపొందించిన పధకాలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కలెక్టర్లు పని చేయాలని సూచించారు.






