- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Cabinet: కేబినెట్ విస్తరణపై మంత్రి పొంగులేటి క్లారిటీ
తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే కేబినెట్ విస్తరణ ఉంటుందని అన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణపై విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రానికి వచ్చాక చర్చిస్తామని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని హైకమాండ్ చెప్పిందని అన్నారు.
చేసిన పనిని చెప్పుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కేసీ వేణుగోపాల్(KC Venugopal) అడిగినట్లు తెలిపారు. ప్రజల డబ్బు వృథా అవుతుందని.. అందుకే పబ్లిసిటీ చేయడం లేదని వివరణ ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు.. ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu) లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన లబ్ధిదారుల ఎంపికను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.






