మేడే రోజున కార్మికులకు శుభవార్త చెప్పిన మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 2 |
మేడే రోజున కార్మికులకు శుభవార్త చెప్పిన మంత్రి మల్లారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. ఒకప్పుడు పక్క రాష్ట్రాలకు మన కార్మికులు వలసలు వెళ్లేవారని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఉండేవి కాదన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత కార్మికుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, కార్మికుల కోసం రాత్రి, పగలు కష్టపడ్డారని అన్నారు. సోమవారం మేడే సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్మికుల సభలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్మికులు చరిత్ర సృష్టిస్తారని, పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు, యాదగిరి గుట్ట, ప్రపంచంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం, సెక్రటరేట్ కట్టింది కార్మికులే అని అన్నారు.

28 రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్టు, దేవాలయం, పెద్ద సెక్రటేరియట్ దేశంలోనే లేదన్నారు. కార్మికుల బాధలు అన్ని సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. అందుకే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేశారన్నారు. 15 రాష్ట్రల కార్మికులకు కేసీఆర్ రాష్ట్రంలో ఉపాధి కల్పించారన్నారు. ఇది వరకు గత ప్రభుత్వాల పాలన వల్ల ఉపాధి ఉండకపోయేదని ఇప్పుడు మాత్రం వేరే వారికి ఉపాధి ఇచ్చే అంత ఎదిగామన్నారు. మంత్రి కేటీఆర్ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తెచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం పది వేల కోట్ల పెట్టి పేద ప్రజలకు వైద్యం అందిచాలని దవాఖానలు కట్టించారు.

పక్క రాష్ట్రాల సీఎంలు కూడా కార్మికుల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. మోడీ నిత్యావసర ధరలు పెంచారని, పేదలను పట్టించుకోకుండా ఆదానీకి ఆస్తులను పెంచారని అన్నారు. మన రావాల్సిన పైసలే కేంద్రం ఇవ్వడం లేదన్నారు. వారి పాపం పండుతుందని మండిపడ్డారు. దేశాన్ని ఏలేది కేసీఆర్ అని, కార్మికులందరూ కేసీఆర్‌కు సపోర్ట్ చేయలన్నారు. కార్మికుల కోసం కేసీఆర్ స్కీంలు తయారు చేస్తున్నారని, కోవిడ్ కారణంగా ఇది వరకు చేయలేదని, రూ.18 వందల కోట్లు కార్మిక శాఖలో ఉన్నాయని వెల్లడించారు. సెంట్రల్ ఉద్యోగుల మాదిరిగా కార్మికుల పిల్లల కోసం సెపరేట్ స్కూల్స్, హస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టంచేశారు. తాను కూడా ఒక కార్మికుడే అని, ప్రతి కార్మికునికి శ్రమశక్తి అవార్డు ఇవ్వాలని, కానీ రూల్ ప్రకారం 60 మందికి మాత్రమే ఇస్తున్నామన్నారు.

Next Story