స్వయంగా కోడి కూర వండిన కేటీఆర్.. గంగవ్వతో కలిసి ఎక్కడ తిన్నాడంటే?

by Disha Web Desk 2 |
స్వయంగా కోడి కూర వండిన కేటీఆర్.. గంగవ్వతో కలిసి ఎక్కడ తిన్నాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వీడియోలతో ఛానల్ ప్రారంభించి.. ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్‌కు ఛానల్‌ను తీసుకెళ్లారు. ముఖ్యంగా యూట్యూబ్ బృందంలో గంగవ్వ బాగా ఫేమస్ అయ్యింది. ఆమెతో పాటు అనిల్, అంజిమామ కూడా సినిమాల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ‘మై విలేజ్‌ షో’ గంగవ్వ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ప్రముఖులతో గంగవ్వ చేసే ఇంటర్వ్యూలు ఆమెను కూడా ఓ స్టార్ సెలబ్రిటీగా మార్చేశాయి. తాజాగా.. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గంగవ్వ టీమ్‌‌తో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ముచ్చట అంటే ఏదో టీవీ ఇంటర్వ్యూ లాగా కాదు. నాటుకోడి కూర చేసుకొని పొలంలో మంత్రితో దావత్ చేసి మరీ సరదాగా గడిపారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వినూత్న ప్రచారం చేయడంలో మంత్రి కేటీఆర్‌ను మించినోడు రాష్ట్రంలో లేడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.















Next Story

Most Viewed