- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు.. నా జీవితమే ఒక పోరాటం: కొండా సురేఖ మరో ప్రకటన
బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. తాజాగా కోర్టు ఆదేశాలపై ఆమె స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
‘నా కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసింది. నాకు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉన్నది. ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణం... ఇది జరిగి రెండు రోజులు అయింది. అయితే, కొంతమంది పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టు సోదరులు... కొండా సురేఖ కేసులో సంచలనం.. బిగ్ బ్రేకింగ్... అంటూ వార్తలు రాయడంలో వారి ఉత్సాహం చూస్తుంటే... నాకు చాలా సంభ్రమాశ్చర్యమనిపిస్తోంది. కొండా సురేఖ పేరు అనగానే ఎంతటి ఉత్సాహం అంటే కొంతమంది రిపోర్టర్లు, నా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని మీడియా, సోషల్ మీడియాల్లో రాస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్న. చివరగా నేను చెప్పేది ఒకటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కొండా సురేఖ ప్రకటనలో పేర్కొన్నారు.






