మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు.. చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు.. చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడటం నాకు అలవాటన్నారు. నటుడు నాగార్జున విషయంలోనూ నేను మాట్లాడింది వేరు.. దాన్ని వివాదంగా చిత్రీకరించిన తీరు వేరని అన్నారు. అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదన్నారు.

మూడు ప్రధాన కంపెనీలు మేడారం టెండర్లు (Medaram Tenders) వేశాయని, అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిదన్నారు. మంత్రిగా నాకు, నా శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులో ఉండాలనేదే తన ఉద్దేశం అని తెలిపారు. సీఎం మేడారం పనులపై మంత్రి పొంగులేటిని ఫోకస్ చేయమన్నారు.. మేడారం పనులు వేగంగా జరగాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంత మంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్‌లో లాబీయింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. ఏది ఉన్నా పార్టీ అధిష్ఠానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తాను.. అని అన్నారు. అందుకే ఎవరు ఏం అనుకున్నా.. మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు.. అని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Next Story