తెలంగాణలో వాటిని ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దు.. మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ర‌హిత స్టేట్‌గా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల‌ని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు.

తెలంగాణలో వాటిని ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దు.. మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ర‌హిత స్టేట్‌గా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల‌ని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని.. పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పోస్టరును మంగ‌ళ‌వారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా "ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం" అనే థీమ్‌తో పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఈ పోస్టర్లు పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయ‌న్నారు.

స్థిరమైన పద్ధతులను అవలంభించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని, వ్యక్తులు పాల్గొనేలా ప్రోత్సహించి ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్రం ప్రభుత్వ నిబద్ధతను మంత్రి నొక్కి చెప్పారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో టీజీ పీసీబీ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ గుగులోత్ ర‌వి, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Next Story