Konda Surekha: శ్రీవారి సేవలో మంత్రి కొండా సురేఖ.. కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం

by Ramesh Naini |

ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించడం జరిగిందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యనించారు.

Konda Surekha: శ్రీవారి సేవలో మంత్రి కొండా సురేఖ.. కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించడం జరిగిందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యనించారు. తన జన్మదినం పురస్కరించుకుని మంగళవారం మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి (Tirumala) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ రోజు నా పుట్టినరోజు సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శ్రీవారిని ద‌ర్శించుకోని స్వామివారి ఆశీస్సులు కుటుంబ స‌మేతంగా వ‌చ్చి తీసుకున్నట్లు తెలిపారు. స్వామి ఆశీర్వాదంతో తెలంగాణ‌లో మా ప్ర‌జా ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నికి మ‌రింత తోడ్పాటు, దీవెన‌లు అందించాల‌ని శ్రీవారిని ప్రార్ధించినట్లు వెల్లడించారు. రేవంత‌న్న నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కారు చేప‌ట్టే కార్య‌క్రమాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ళాల‌ని.. మా ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప‌ని పేద ప్రజ‌ల‌కు అందేలా స్వామివారు ఆశీర్వ‌దించాల‌ని కోరుకున్నారని తెలిపారు.

Next Story