క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. మంత్రి కొండా సురేఖ రియాక్షన్ ఇదే

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. మంత్రి కొండా సురేఖ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు(Nampally Court) పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. శనివారం సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. కేసు నమోదుపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. దీనిపై కోర్టు నుంచి నోటీసులు వస్తే స్పందిస్తానని చెప్పారు. కాగా, కోర్టు ఆదేశాలపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది.

Next Story