- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు అహంకారం పెరగడం వల్లే బీఆర్ఎస్‌ను బొందపెట్టారు: మంత్రి కొండా సురేఖ
by Satheesh |
బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అహంకారం పెరగడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అహంకారం పెరగడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారని అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి మరకలేని నేత అని కొనియాడారు. కడియం శ్రీహరి అనుభవం, సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్‌లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోందని అప్పుడు పార్టీ కోసం త్యాగం చేసిన వారికీ మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Next Story






