- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అక్కగా చెబుతున్నా.. మీ మీద చేయి పడితే ఊరుకోను’: మంత్రి కొండా సురేఖ భరోసా
అటవీ అధికారుల(Forest Officials)పై దాడులు చేస్తే పీడీ యాక్టులు పెడతామని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అటవీ అధికారుల(Forest Officials)పై దాడులు చేస్తే పీడీ యాక్టులు పెడతామని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల అసోసియేషన్ సంఘాలతో మంత్రి సురేఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల సంఘాల నాయకుల తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ... తాను ఫారెస్టు సిబ్బందికి ఒక అక్కగా అండగా ఉంటానని చెప్పారు. ఫారెస్టు ఉద్యోగుల సమస్యలు వినేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. చిన్న చిన్న విషయాలు శాఖపరంగా మనమే పరిష్కరించుకుందామని గుర్తు చేశారు. కీలక అంశాలు సీఎం(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిద్దామని చెప్పారు. మనమంతా ఒక ఫ్యామిలీ అని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఎందుకంటే, అటవీ శాఖకు, ఫారెస్టు ఉద్యోగులే ఫ్రంట్ రన్నర్స్ అని తెలిపారు. అలాంటి ఉద్యోగుల కోసం పని చేయడం తన బాధ్యత అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
పోలీసులకు ఎటువంటి జీత భత్యాలు ఇస్తున్నారో.. అటవీ అధికారులకు అంతే స్థాయిలో ఇచ్చేందుకు తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పారు. అయితే, మంత్రి సురేఖ స్పందనకు సమావేశంలో పాల్గొన్న అటవీ అధికారుల అసోసియేషన్ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ అధికారులకు అవార్డులు ఇచ్చేవారని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ అవార్డులు ఇవ్వడం ఆపేశారని మంత్రి సురేఖ గుర్తుచేశారు. అయితే, ఇటీవల జరిగిన అటవీ శాఖ రివ్యూలో సీఎం దృష్టికి తీసుకెళితే ఆయన సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి సురేఖ సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ వచ్చిన తరువాత ఈ తరహాలో మంత్రి సపోర్టు చేయడం తొలిసారి అని ఫారెస్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.






