- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా అవసరం ఉందంటే క్షణంలో అక్కడుంటా’: మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర ట్వీట్
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్‌కు పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్(Drugs) ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్‌కు పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్(Drugs) ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పిలుపునిచ్చారు. గురువారం నల్గొండలో మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా NG కాలేజీ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా అనంతరం డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది.. స్టూడెంట్స్ డ్రగ్స్‌కి బానిసలవుతున్నారు.. ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నామని అన్నారు. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ అన్నదే ఉండకూడదు అనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
‘విద్యార్థుల భవిష్యత్ కోసం నల్గొండలో రూ.34 కోట్లతో స్కిల్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తాం. విద్యార్థులు 20 ఏళ్ల వయస్సు వరకు చదువు, క్రీడలు, యోగా పైనే దృష్టిపెట్టాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండండి. అవసరమైతేనే వాడండి. మీరు చదువులో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలు రాయండి, ఉద్యోగాలు సంపాదించండి. డ్రగ్స్ వాడేవారిని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మన సమాజాన్ని రక్షిద్దాం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలను, డిజిటల్ తరగతులను అందిస్తున్నాం. మీకు అవసరమైన చోట నేను నా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటాను. నా అవసరం ఉంది అనిపిస్తే.. క్షణంలో అక్కడ ఉంటాను. మీ భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. అదే నిజమైన స్వేచ్ఛ’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి కోమటిరెడ్డి ట్వీట్ పెట్టారు. ట్వీట్






