- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ లిల్లీపుట్ మళ్లీ గెలవడు.. మంత్రి కోమటిరెడ్డి సెటైర్
బీఆర్ఎస్ పార్టీ(BRS Party) భవిష్యత్తు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ(BRS Party) భవిష్యత్తు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిలో నల్లగొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదే అని సూచించారు. గ్రామీణ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ వందకు వందశాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. నాలుగు ముక్కలు అయిందని విమర్శించారు. అది ఆల్రెడీ మునిగిపోయిన నావ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలోని లిల్లీపుట్‌ను కూడా ఓడిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని అన్నారు.






