- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇవాళ చాలా హ్యాపీగా ఉంది’.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
నల్గొండ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)లో ఆధునిక లాప్రోస్కోపీ యూనిట్‌ను, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)లో ఆధునిక లాప్రోస్కోపీ యూనిట్‌ను, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, పద్మ విభూషణ్ డా.నాగేశ్వర్ రెడ్డి, డా. జీవీ రావుతో కలిసి ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. నల్గొండ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లాప్రోస్కోపీ సర్జరీలు అత్యాధునిక సాంకేతికతతో, తక్కువ సమయంలో రోగుల కోలుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి సదుపాయాలు గ్రామీణ మరియు అర్బన్ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావడం ఒక గొప్ప ముందడుగు అని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం నా వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని అన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న డా.నాగేశ్వర్ రెడ్డి, డా. జీవీ రావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ యూనిట్ ద్వారా లబ్ధిపొందాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.






