- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఉద్వేగభరిత క్షణాలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి: మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ సోషల్ మీడియా వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ సోషల్ మీడియా వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘నల్లగొండ అంటే పేరు కాదు.. న్యాయమైన పోరాటానికి.. ధర్మం కోసం నిలబడే ధైర్యానికి.. సత్యం కోసం పిడికిలెత్తే తెగింపునకు.. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు.. అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అణువణువూ పునికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు మంత్రి పదవి వదిలి క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటే.. వీరతిలకం దిద్ది.. పోరు చేయిబిడ్డ అని హారతి పట్టి వెన్నంటే నిలిచిన ఆ ఉద్వేగ భరిత క్షణాలు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఎన్నటి రుణబంధమో కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ.. నా వెన్నంటే నడుస్తున్న మీకు నేను ఏమిచ్చినా.. ఎంత చేసినా తక్కువే.. మీ పాదాలకు ప్రణమిల్లుతూ నమస్కరిస్తున్నా. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజి మాటలు నాలో ఎప్పుడు స్పూర్తిని నింపుతూనే ఉంటాయి’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.






