- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పెద్ద మనిషి ఎలా మర్చిపోయాడో తెలియదు.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. ఇందులో ఎక్కువ రోజులు ఆ ఎన్నికలు.. ఈ ఎన్నికలు అంటూ కోడ్‌లకే ఎక్కువ రోజులు పోయాయి. మిగిలిన కొన్ని రోజుల్లోనే తాము ప్రకటించిన అన్ని హామీలు అమలు చేసి రాష్ట్రంలోని ప్రతీ గడపకు అందించామని అన్నారు. తాజాగా తీసుకొచ్చిన సన్నబియ్యం పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన దొడ్డుబియ్యం ప్రజలకు అందలేదని.. ఎక్కువశాతం పక్కదారి పట్టాయని అన్నారు.
తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ అని ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ వల్ల అని అన్నారు. ఆ విషయాన్ని ఆ పెద్ద మనిషి ఎలా మర్చిపోయాడో తెలియట్లేదని కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పైగా కాంగ్రెస్‌పై నిందలు వేశారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో పడుకొని రూ.లక్షల కోట్లు దోచుకున్నారు. 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం కట్టారు.. కూలిపోయిందని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






