- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy: రీజినల్ రింగ్ రోడ్.. నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమగ్ర చర్చలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన MoRTH, NHAI అధికారులతో రాష్ట్రంలోని పలు రహదారుల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన MoRTH, NHAI అధికారులతో రాష్ట్రంలోని పలు రహదారుల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా మంత్రి వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ హైవేలోని 17 బ్లాక్ స్పాట్స్, కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్, నూతన కారిడార్లు, ఫారెస్ట్ క్లియరెన్స్ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రజల సౌకర్యం, రోడ్డు భద్రత, రవాణా సౌలభ్యం మెరుగులో భాగంగా కేంద్ర-రాష్ట్ర స్థాయిలో సమన్వయం జరుపుతూ, ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో R&B శాఖ ఉన్నతాధికారులు, RDC చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, MoRTH డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ రజావత్, NHAI మెంబర్ అనిల్ చౌదరి తదితర అధికారులు పాల్గొన్నారు.






