మీలాగా మాటలు కాదు... చేతల ప్రభుత్వం మాది.. హరీశ్‌రావుకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

by Ramesh Naini |

మీలాగా మాటలు చెప్పేరకం కాదు .. మాది చేతల ప్రభుత్వం.. విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్న ఇది ప్రజాప్రభుత్వమని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మీలాగా మాటలు కాదు... చేతల ప్రభుత్వం మాది.. హరీశ్‌రావుకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీలాగా మాటలు చెప్పేరకం కాదు .. మాది చేతల ప్రభుత్వం.. విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్న ఇది ప్రజాప్రభుత్వమని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. సోమవారం (Harish Rao) హరీశ్‌రావుకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆసుపత్రులు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేసి వదిలేశారు.. ఆ స్థాయిలో వదిలేసిన ఆసుపత్రులను శరవేగంగా నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. మిస్టర్ హరీశ్‌రావు మీలాగా మాటలు చెప్పి కాలం ఎల్లదీసిన ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపే చేతల ప్రభుత్వం మాది అని అన్నారు. విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

గత (BRS government) బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయారు.. వాటిని మేము చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. నిత్యం మా ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని అన్నారు. నిర్మాణాలు ఆగకుండా రేయింబవళ్ళు పనులు జరుగుతున్నాయన్నారు. సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31కి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించాం.. అల్వాల్ హాస్పిటల్ దగ్గర వెయ్యి మంది ఒకే షిఫ్టులో పనిచేస్తున్నారని, వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ లో చేపడుతున్న ఆసుపత్రి భవనం వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

నిమ్స్ ఆస్పత్రిలో రూ.2వేల కోట్లతో నిర్మిస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. వరంగల్ హాస్పిటల్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎలక్షన్స్ లు రావడంతో హరీష్ రావు రాజకీయం కోసం పొలిటికల్ విజిట్స్ చేశారని ఎద్దేవా చేశారు. ప్రజల మేలు కోసం మేము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Next Story