సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నల్గొండ(Nalgonda) జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను(YIIRS) మంజూరు చేసినందుకు కోమటిరెడ్డి సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ పాఠశాల నిర్మాణానికి ఆగస్టు 4న భూమి పూజ జరగనుంది. ఈ స్కూల్ ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా అందించనున్నామని మంత్రి తెలిపారు. అదే రోజు, నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరగనుంది. నల్గొండ పట్టణంలో క్యాంప్ ఆఫీస్ ఉండటం ద్వారా జిల్లా ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి, ప్రజాపాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వేదికగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story