‘ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలో లేదు.. రాదు’: మంత్రి కోమటిరెడ్డి

by Kodari Anjali |   (  Updated:2024-05-09 14:26:23  IST  )

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలో లేదు.. రాదు’: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నిజమైన నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్‌లా ఎలక్షన్.. కలెక్షన్.. బై ఎలక్షన్ దొంగ ఉద్యమకారుడు కాదని అన్నారు. ప్రాణాలకు తెగించి నాతో పాటుగా పోరాటం చేశాడు. నాతో పాటుగా సర్వం ధారపోసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే అర్హుడు అని వెల్లడించారు. మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదన్నారు. నాకు పదవుల మీద ఆశ లేదు.. నా తెలంగాణ బాగుంటే చాలు అన్నారు. ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. నాకు ఏ పదవి వద్దన్నారు. ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలో లేదు.. రాదు అని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుడ్ని అని పేర్కొన్నారు.

Read More...

రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీని బొంద పెట్టాలి

Next Story