- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాను మినీ కాశ్మీర్ చేస్తాం: మంత్రి జూపల్లి
రానున్న రోజుల్లో టూరిజం హబ్‌గా ఆదిలాబాద్ మారబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో టూరిజం హబ్‌గా ఆదిలాబాద్ మారబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) అన్నారు. ప్రకృతి సౌందర్యంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం ఆదిలాబాద్ జిల్లాకు ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆదిలాబాద్‌ను మినీ కాశ్మీర్ మారుస్తామని.. పర్యాటకాన్ని డెవలప్ చేస్తామని కీలక ప్రకటన చేశారు. దీంతో ఆదిలాబాద్‌కు పెట్టుబడులు వస్తాయని.. యువకులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దే గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా చిన్న వయసులోనే నాకు అవకాశం వచ్చిందని అన్నారు. ప్రజల గౌరవ మర్యాదలు పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశ్వీరాదం, దేవుడి సంకల్పం వల్లనే ముఖ్యమంత్రి అయ్యానుని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించాను.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ బీజేపీ అయినప్పటికి వారిని కలుపుకుని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.






