దమ్ముంటే చర్చకు రా.. కేటీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-11-05 08:24:41  IST  )

రౌడీ రాజ్యం మాది కాదు బీఆర్ఎస్ దేనని కేటీఆర్‍కు జూపల్లి కౌంటర్ ఇచ్చారు.

దమ్ముంటే చర్చకు రా.. కేటీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు (KTR) మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) కౌంటర్ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కొక్కరిపై రూ.4 లక్షల అప్పు మోపారని దుయ్యబట్టారు. 10 ఏళ్ల పాటు బుల్డోజర్ పాలన చేసింది బీఆర్ఎస్సేనని రౌడీ రాజ్యం మాది కాదు.. బీఆర్ఎస్ దేనన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన జూపల్లి.. అధికారులను తాను బెదిరిస్తున్నానని ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నానని చెప్పారు. ఫేక్ సర్వేలతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాగురించి మాట్లాడే అర్హత కేటీఆర్‍కు లేదన్నారు. కావాలంటే కేటీఆర్‍తో చర్చకు సిద్ధమని కేటీఆర్ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.

READ MORE .....

ఇది నిజంగా గర్వించదగిన రోజు.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Next Story