జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్

by GSrikanth |
జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీసీబంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇన్నేళ్ల కాంగ్రెస్‌ పాలన రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. ఎన్నికల ముగిసిన దగ్గరనుంచి నేటి వరకు నియోజకవర్గ ప్రజలకు జగ్గారెడ్డి అందుబాటులో లేరని విమర్శించారు. కనీసం ఆయన ఫోన్ నెంబర్ కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదన్నారు.

వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో బీసీ బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమంతోపాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.

Next Story

Most Viewed