కర్ణాటక ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కర్ణాటక ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.97 కోట్లతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను మంగళవారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో మరే రాష్ట్రం పోటీ పడలేదని ధీమా వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎక్కడ ఉన్నాయని అన్నారు.

బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా నియ్యత్ ఉంటే.. బర్కత్ ఉంటదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చేసిన సాయాన్ని ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు, కానీ కొత్తగా ఉద్యోగాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను అర్ధాంతరంగా తీసేశారని అన్నారు. ఉన్న ఉద్యోగాలు తొలగించేంది బీజేపీ అయితే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి కడుపులో పెట్టుకుని చూసేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. సంగారెడ్డిలో ఉన్న ODF ఫ్యాక్టరీ భూముల్ని కేంద్రం అమ్ముతోందని తెలిపారు. పన్నులు పెంచేది బీజేపీ పార్టీ.. పనులు చేయించేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

Also Read...

గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాం.. మంత్రి హరీశ్ రావు

Next Story

Most Viewed