- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ అనుభవం తెలంగాణకు చాలా అవసరం’.. కొత్త సీఎస్‌కు మంత్రి శుభాకాంక్షలు
తెలంగాణ నూతన సీఎస్(Telangana New CS)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు(CS Ramakrishna Rao)కు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సీఎస్(Telangana New CS)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు(CS Ramakrishna Rao)కు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అభినందనలు తెలిపారు. ఆయన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంత్రి సురేఖను సెక్రటేరియట్‌లోని ఆమె ఛాంబర్‌లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఆయన్ను సన్మానించి.. కంగ్రాట్స్ తెలిపారు. అనంతరం మినిస్టర్ సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలన విభాగంలో, తెలంగాణ ఆర్థిక కార్యకలాపాల్లో సీఎస్ రామకృష్ణా రావుకు ఉన్న అపార అనుభవం ప్రస్తుతం రాష్ట్ర పురోగతి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటువంటి సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్రంలోని అన్ని విభాగాలు ముందుకు వెళుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. త్వరలో తమ ఎండోమెంటు డిపార్టుమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు రామకృష్ణారావు కృషి చేయాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకి రామకృష్ణరావు ధన్యవాదాలు తెలిపారు.






