- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలపై ఫేక్ ప్రచారం! MHSRB స్పష్టీకరణ
తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) స్పష్టం చేసింది. ఈ అంశంపై ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని బోర్డు తెలిపింది. ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ మార్కుల అంశానికి సంబంధించి 2022లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.59 ప్రకారమే అర్హులకు వెయిటేజీ మార్కులు కలుపుతున్నామని MHSRB పేర్కొంది. కొత్తగా ఎలాంటి నిబంధనల మార్పులు చేయలేదని, 2022 నుంచి జీవో 59 ప్రకారమే నియామకాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు 10,850 పోస్టులను పూర్తిగా పారదర్శకంగా భర్తీ చేశామని బోర్డు వెల్లడించింది. నియామక ప్రక్రియలో ప్రతి దశలోనూ అభ్యర్థులకు అభ్యంతరాలు తెలియజేసేందుకు తగిన గడువు ఇస్తున్నామని, వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని సమగ్రంగా పరిశీలించి స్పష్టత ఇచ్చిన అనంతరమే తదుపరి దశకు వెళ్తున్నామని వివరించింది. నియామకాల్లో పారదర్శకత, న్యాయసమ్మత విధానాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని MHSRB కార్యదర్శి మంగళవారం ఒక రీజోయిండర్‌లో పేర్కొన్నారు.






