- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MGNREGA బచావో సంగ్రామ్‌కు 9 మందితో సమన్వయ కమిటీ.. మంత్రి సీతక్కకు చోటు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం చేపట్టిన ‘MGNREGA బచావో సంగ్రామ్’ కార్యక్రమం అమలును పర్యవేక్షించడం, మార్గనిర్దేశం చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పరిరక్షణ కోసం చేపట్టిన ‘MGNREGA బచావో సంగ్రామ్’ కార్యక్రమం అమలును పర్యవేక్షించడం, మార్గనిర్దేశం చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం 9 మందితో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీకి అజయ్ మాకెన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా జైరాం రమేశ్, సందీప్ దీక్షిత్, డా. ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, దీపికా పాండే సింగ్, డా. సునిల్ పాన్‌వార్, మణీష్ శర్మ ఉన్నారు.
కమిటీలో సీతక్కకు చోటు
అదేవిధంగా కమిటీలో అధిష్టానం తెలంగాణ మంత్రి డి. అనసూయ సీతక్కకు చోటు కల్పించారు. అలాగే, కాంగ్రెస్‌కు చెందిన అన్ని ఫ్రెంట్ ఆర్గనైజేషన్ల అధ్యక్షులు, ఏఐసీసీ OBC, SC, మైనారిటీ, ఆదివాసీ కాంగ్రెస్ విభాగాలు, కిసాన్ కాంగ్రెస్ చైర్‌పర్సన్లు కూడా ఈ సమన్వయ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. అమలులో ఎదురవుతున్న సమస్యలు, హక్కుల పరిరక్షణకు దిశానిర్దేశం చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కమిటీ ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.






