నిన్న ఈనో.. నేడు టానిక్, ట్యాబ్లెట్‌లు.. బీఆర్ఎస్ నేతలకు పంపిన కాంగ్రెస్ నేత

by Ramesh Naini |   (  Updated:2025-01-25 10:38:46  IST  )

దావోస్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

నిన్న ఈనో.. నేడు టానిక్, ట్యాబ్లెట్‌లు.. బీఆర్ఎస్ నేతలకు పంపిన కాంగ్రెస్ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను చూసి (BRS leaders) బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ నేతలకు (ENO) ఈనో ప్యాకెట్లు పంపారు. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ.. హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్‌లు సైతం వెలిశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ నేతలకు టానిక్ సిరప్‌లు, ట్యాబ్లెట్లు కాంగ్రెస్ నేత పంపారు. తాజాగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోండి అంటూ మందులు పంపిస్తున్నట్లు తెలిపారు.

(KTR) కేటీఆర్, (Harish Rao) హరీశ్‌రావుకు ఒక బాటిల్ సిరప్, ట్యాబ్లెట్స్ అడ్రస్ రాసిన కవర్‌లో ప్యాక్ చేశారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులకు జీర్ణకోశ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వారి ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకోని ఈ మెడిసిన్‌లు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సమయాల్లో ఆ మెడిసిన్ వాడాలని సెటైర్లు వేశారు.

Next Story