తెలంగాణలో మరో రెండు రోజులు వడగాల్పులు

by Dishafeatures2 |
తెలంగాణలో మరో రెండు రోజులు వడగాల్పులు
X

దిశ , తెలంగాణ బ్యూరో : దక్షిణ ఛత్తీస్ గఢ్ లో ద్రోణి ప్రభావంతో గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయవ్య గాలులు వీస్తున్నాయని దీని కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా మరో రెండు రోజుల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు ఉంటయని ఎండలు క్రమ క్రమంగా తగ్గుతాయనీ ఐఎండీ వెల్లడించింది.

. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుండే అవకాశముందని అదే విధంగా రాబోయే 24 గంటల్లో ఇదే విధమైన వాతావరణం వుండే అవ‌కాశ‌ముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, మధ్య భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. 38-40 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 15 లేదా 16 నుండి రుతుపవనాల కారణంగా వాతావరణంలో మార్పులు జరిగే అవకాశముందని , ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతాలలో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed