తెలంగాణలో వర్షాలపై వాతావరణ కేంద్రం ప్రకటన

by Gantepaka Srikanth |

రానున్న మూడు రోజుల్లో రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో వర్షాలపై వాతావరణ కేంద్రం ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న మూడు రోజుల్లో రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కర్నాటక నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొందిపలు జిల్లాలకు ఈదురు గాలులతో కూడిన వర్షసూచన ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది.




Next Story