వస్త్రాల కొనుగోలులో టెండర్లు రద్దు చేయాలి: సీఎం సలహాదారుడికి విన్నపం

by Gantepaka Srikanth |

ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను నేరుగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి.

వస్త్రాల కొనుగోలులో టెండర్లు రద్దు చేయాలి: సీఎం సలహాదారుడికి విన్నపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను నేరుగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి. టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ శుక్రవారం కోరింది. టెస్కో ద్వారానే గురుకుల పాఠశాల విద్యార్థులకు కావలసిన వస్త్రాలు కొనుగోలు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ నేతృత్వంలో ఫెడరేషన్ ప్రతినిధులు కలివారు. అలాగే చేనేత రంగం సమస్యలను ఆయనకు వివరించారు. చేనేత సహకార సంఘాల వద్ద ఉన్న బెడ్ షీట్లు, దుప్పట్లు, దరీస్ తదితర వస్త్రాలన్నీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. మరి కొద్ది రోజుల తర్వాత చేనేత సమస్యలపై చర్చిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు బాసబత్తిని రాజేశం, కన్వీనర్ వనం శాంతి కుమార్, కోర్ కమిటీ సభ్యులు కర్నాటి మనోహర్, జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు చిక్కా దేవదాస్, చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న, తెలంగాణ ప్రాంత పద్మశాలి అధ్యక్షులు కమ్మర్తపు మురళి, వరంగల్ జిల్లాకు చెందిన చిప్ప వెంకటేశ్వర్లు, ఎలుగం భద్రయ్య, ఎలుగం వెంకట మల్లు పాల్గొన్నారు.

Next Story