ఆ గుడ్ న్యూస్‌తో ఫుల్ హ్యాపీ మోడ్‌లో మెగా డాటర్ నిహారిక.. ఇంతకన్న సంతోషం ఏం కావాలి అంటూ..

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించగా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఆ గుడ్ న్యూస్‌తో ఫుల్ హ్యాపీ మోడ్‌లో మెగా డాటర్ నిహారిక.. ఇంతకన్న సంతోషం ఏం కావాలి అంటూ..
X

రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించగా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డుతోపాటు దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, మెగా డాటర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. తమ చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ -2024లో రెండు అవార్డులను గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, సినిమాను గుర్తించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుడ్ న్యూస్‌పై నిహారిక ఇంకా ఏమన్నదో ఈ లింక్ఓపెన్ చేసి చూడండి.

మీ కుటుంబ, వారసత్వ, పార్టీ పంచాయితీ, మీ అన్నతో మీకు పంచాయితీ ఏదైనా ఉంటే మీరు మీరు తేల్చుకోవాలని, బీజేపీని అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దని కవితకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. 2014లో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పింది ఎవరని రఘునందన్ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌తో తమ పార్టీ అధిష్టానం ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కవిత చెల్లని రూపాయి అని తీవ్ర విమర్శలు చేశారు. కవిత, కేటీఆర్‌కు ఇద్దరికీ బ్రాండ్‌ లేదని, మళ్లీ కేసీఆర్ కుటుంబం రీ బాండింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్నాచెళ్లెల్ల గురించే చర్చ జరగాలని ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కవిత జాగృతి పెట్టకముందు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకోలేదా? అని ప్రశ్నించారు. కవితపై ఇంకా ఏం కామెంట్స్ చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడుతో చరిత్ర సృష్టించామని ఏపీ మంత్రులు, టీడీపీ ప్రముఖ నేతలు పేర్కొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించిన మహానాడు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు సవిత, రాంప్రసాద్రెడ్డి కడపలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహానాడుతో కడపపై ఉన్న అపోహ కూడా తొలగి పోయిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు మహానాడుకు కదం తొక్కారని పేర్కొన్నారు. మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదన్నారు. టీడీపీ నేతలు ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story