Meenakshi Natarajan: నవంబర్ చివరి వారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ: మీనాక్షి నటరాజన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-08 09:00:49  IST  )

ఓట్ల చోరీ అంశంపై మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Meenakshi Natarajan: నవంబర్ చివరి వారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ: మీనాక్షి నటరాజన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఏఐసీసీ వ్యవహారాల ఇన్‍చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదని ధ్వజమెత్తారు. ఇవాళ గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ అనేక విషయాలు బయటపెట్టారని బిహార్‍లో కూడా ఓటు చోరీ జరుగుతోందని ఆరోపించారు. ఓటు చోరీకి (Vote Chori) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతోందని ఈ ఎన్నికలు ముగిశాక లక్షలాది మంది ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేపడతామన్నారు. నవంబర్ ఆఖరి వారంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మందితో కలిసి ఢిల్లీలోని రామ్‍లీలా మైదానంలో ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

Next Story