CM Revanth Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్.. సీఎంతో మీనాక్షి నటరాజన్ భేటీ

by Prasad Jukanti |

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.

CM Revanth Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్.. సీఎంతో మీనాక్షి నటరాజన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Election) ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) భేటీ అయ్యారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Reddy) సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలనేదానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అవకాశం కోసం భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు విషయంలో ఏ రకంగా వడపోత చేపడితే పార్టీకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నిన్న మెదక్, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ పై సీఎంతో మీనాక్షి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండేవారికే ఎమెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీసీ పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా రేపు కేబినెట్ భేటీ జరగనున్నది. అనంతరం కేబినెట్ నిర్ణయాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది.

Next Story