- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: వారికి నో డీసీసీ చాన్స్: మీనాక్షి నటరాజన్
డీసీసీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం డీసీసీలుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి అవకాశం లేదని ఏఐసీసీ వ్యవహారాల ఇన్‍చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‍లో డీసీసీల ఎంపిక (DCC selection) కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదేశాలను (AICC guidelines) వారికి తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పని చేసి ఉండాలని అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. డీసీసీల ఎంపిక కోసం అధిష్టానం పంపించిన ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. జిల్లాలోని సమావేశాలు అక్కడి నాయకుల ఇళ్లల్లో, వారి స్వంత కార్యాలయాల్లో పెట్టారాదని కేవలం పార్టీ కార్యాలయం లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం వంద మంది సంతకాలు చేయించి పంపించాలని సూచించారు.






