- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20న మెడికల్ షాపుల బంద్! జాగ్రత్తలు పాటించాలి : డీసీఓఐడబ్ల్యూఏ
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు వ్యతిరేకతగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఈ నెల 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు వ్యతిరేకతగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఈ నెల 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ (డీసీఓఐడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో సూచనలు చేశారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో (షుగర్, బీపీ, క్యాన్సర్ వంటివి) బాధపడే రోగులు ముందస్తుగా మందులు కొనుగోలు చేసుకోవాలని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.
బంద్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని అటు కెమిస్టులకు, ఇటు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతే ప్రాధాన్యంగా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.






