- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్షమొలలు ఆపరేషన్ ప్రాణం మీదకు తెచ్చింది..! సంఘటనపై మెడికల్ కౌన్సిల్ దర్యాప్తు
రంగల్ జిల్లా మంగళవారిపేటలో నకిలీ వైద్యులు నిర్వహించిన అర్షమొలల ఆపరేషన్ విఫలమై యువకుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరంగల్ జిల్లా మంగళవారిపేటలో నకిలీ వైద్యులు నిర్వహించిన అర్షమొలల ఆపరేషన్ విఫలమై యువకుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. బాధితుల వివరాల ప్రకారం.. చింతనెక్కొండకు చెందిన రజనీకాంత్ (29) కు నవంబర్ 13న కౌసల్య అనే మహిళ, చిట్టిబాబు అనే ఆర్‌ఎంపీ కలిసి ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. అదే రాత్రి తీవ్ర రక్తస్రావంతో హైపోవోలెమిక్ షాక్ కు గురైన బాధితుడు రాత్రి 11 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని బృందం అత్యవసర శస్త్రచికిత్స చేసి రక్తస్రావాన్ని నియంత్రించింది. కానీ పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బాధితుడి కుటుంబ ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పీఆర్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ వేములపల్లి, జిల్లా ఆంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు డా. ఎం. దిలీప్ కుమార్‌లు 14వ తేదీన ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. ఎంబీబీఎస్ అర్హత లేని ఆర్‌ఎంపీలు అల్లోపతి చికిత్సలు, ల్యాబ్ టెస్టులు, ఆపరేషన్లు చేయలేరని, వారి చికిత్సలు ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ప్రజలు మోసపోవద్దని కౌన్సిల్ హెచ్చరించింది. కౌసల్య, చిట్టిబాబు అనే నకిలీ వైద్యులపై విచారణ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ వైద్యులపై ఫిర్యాదుల కోసం 9154382727 కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని మెడికల్ కౌన్సిల్ తెలిపింది.






