ఫెర్టిలిటీ సెంటర్లపై కొరడా ఝుళిపిస్తున్న మెడికల్ కౌన్సిల్

by Muthe.Rajitha |

ఇటీవల రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన(Shrishti Fertility Center Incident) గురించి తెలిసిందే.

ఫెర్టిలిటీ సెంటర్లపై కొరడా ఝుళిపిస్తున్న మెడికల్ కౌన్సిల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన(Shrishti Fertility Center Incident) గురించి తెలిసిందే. ఓ జంట తమకు ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా కలిగిన బాబుకు తండ్రి DNA కాకపోవడంతో సృష్టి ఆసుపత్రి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్రాంచ్ లు కలిగిన ఉన్న ఈ ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమంగా వీర్యం నిలువ చేస్తున్నారని తేలింది. అంతేకాదు ఎలాంటి సరోగసి విధానం లేకుండానే, పుట్టిన పసిగుడ్డులను అక్రమంగా తరలించి, పిల్లలు లేని తల్లిదండ్రులకు సరోగేట్ బేబీ అంటూ కట్టబెట్టి లక్షల్లో డబ్బులు గుంజారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసి... ఏపీ, తెలంగాణలోని సృష్టి సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) ఫెర్టిలిటీ సెంటర్లపై కొరడా ఝుళిపించనుంది. నిబంధనలు అతిక్రమించిన క్లినిక్‌లను సీజ్ చేస్తూ కఠిన చర్యలకు సిద్ధం అయింది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 200 వరకు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయని, వీటి పర్యవేక్షణ జిల్లా వైద్యాధికారుల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఇకపై నిబంధనలు ఉల్లఘించిన సెంటర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అవసరం అయితే అరెస్టులు చేసి, కేసులు కూడా నమోదు చేస్తామని ఫెర్టిలిటీ సెంటర్లను హెచ్చరించారు.

Next Story