- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి : సీపీ బి. సుమతి
యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి అన్నారు. షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్, అపూర్వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్ డిస్టిక్ 320– ఏ) డిజైన్ చేసిన “స్టాప్ డ్రగ్ అబ్యూస్” పోస్టర్ ని గురువారం మల్కాజ్ గిరి కమిషనర్ బి. సుమతి తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి అన్నారు. షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్, అపూర్వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్ డిస్టిక్ 320– ఏ) డిజైన్ చేసిన “స్టాప్ డ్రగ్ అబ్యూస్” పోస్టర్ ని గురువారం మల్కాజ్ గిరి కమిషనర్ బి. సుమతి తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ కి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఆ మత్తులో స్త్రీలపై దాడులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి మానసిక స్థితిని, స్నేహితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు డ్రగ్స్ అలవాటు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ నిర్మూలనకై స్వచ్చంద సంస్థలు మరియు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్, అపూర్వ లయన్ చైర్ పర్సన్ టి. నైనా దేవి మాట్లాడుతూ.. హైదరాబాద్ పట్టణంలో కాలేజీ విద్యార్థులు పెయింట్, హెయిర్ స్ప్రేలు, హెరాయిన్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు సిటీ పోలీస్ కమీషన్ నివేదికలో వెల్లడైనట్లు తెలుపూతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తల్లిదండ్రులను దు:ఖానికి గురిచేయొద్దని అన్నారు.
మాదకద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్యసమస్యలు కాకుండా జీవితాలే నాశనం అవుతున్నాయని డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ డ్రగ్స్ నిర్మూలనకై మేడ్చల్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లల్లో, రైల్వేస్టేషన్లల్లో, పాఠశాలలు, కాలేజీలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న “షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్” వ్యవస్థాపకులు సి.హెచ్. అశోక్ , ఫౌండేషన్ సలహాదారులు హైకోర్ట్ అడ్వకేట్. అవినాష్ రెడ్డిని, లయన్స్ క్లబ్ మెంబర్స్ ని మల్కాజిగిరి కమీషనర్ బి. సుమతి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీహెచ్. లయన్స్ వనిత భారత్ ప్రెసిడెంట్ ,లియో చైర్పర్సన్, రిటైర్డ్ అడిషనల్ సుక్రెటరీ జి. క్రిష్ణవేణి, లయన్స్ వనిత భారత్ ట్రెజరర్ జయశ్రీ పాల్గొన్నారు.






