శ్రీరాముడి వలే పాలన అందిస్తున్నాం :మంత్రి

by Naveena |

సికింద్రాబాద్ తాడ్ బండ్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర బీసీ శాఖ మంత్రి,హైదరాబాద్ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీరాముడి వలే పాలన అందిస్తున్నాం :మంత్రి
X

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ తాడ్ బండ్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర బీసీ శాఖ మంత్రి,హైదరాబాద్ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ శ్రీరాముడి వలే ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలందరికీ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ఆయన వెంట ఎమ్మెల్యే శ్రీగణేష్,ఈఓ నరెందర్ లు ఉన్నారు.

అదే విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. రామరాజ్యం వలే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవించే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. అనంతరం కంసాలి బజార్ లోని ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. న్యూ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం మహోత్సవానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ పద్మావతి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ముత్తయ్య,శ్రీనివాస్,మధు,నాగరాజు,రాము గౌడ్,టింకుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story