- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 23 నుంచి వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు
వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యూబీఎన్ బాబు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, అల్వాల్: వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యూబీఎన్ బాబు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను అండర్ 11, 13,15,17,19 మరియు మెన్, ఉమెన్, మిక్స్‌డ్ డబుల్స్, మాస్టర్స్ విభాగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు కూకట్‌పల్లిలోని ఎస్ ఎల్ వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో జరగనున్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, ఇతర జిల్లాలకు చెందిన క్రీడాకారులు అర్హులు కారని స్పష్టం చేశారు. పోటీల్లో పాల్గొనదలచిన ఆసక్తి గల క్రీడాకారులు మే 20వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం సంఘం వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7674897777 లేదా 9000005678 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.






