యువ‌కుడు అదృశ్యం

by Ratna Kumari |

హాస్టల్ కి పంపిస్తాం అని తల్లిదండ్రులు అన్నందుకు కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

యువ‌కుడు అదృశ్యం
X

దిశ, ఉప్పల్ : హాస్టల్ కి పంపిస్తాం అని తల్లిదండ్రులు అన్నందుకు కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం చిలకానగర్ న్యూ రామ్ కాలనీలో నివాసం ఉంటున్న మనీష్ (19) చిన్నప్పటి నుంచి మాటలు తడబడుతూ మాట్లాడుతున్నాడని తన తల్లి దండ్రులు అతనికి సరిగా మాటలు వస్తాయని హాస్టల్ కి పంపిస్తాం అని చెప్పినందుకు గత నెల 26 న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. దీంతో తన తల్లిదండ్రులు చుట్టూ ప్రక్కల వెతికినా అతని ఆచూకీ తెలియకపోవటంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోటో లో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే ఉప్పల్ పోలీస్ లకి సమాచారం ఇవ్వగలరని ఎస్సై వినయ్ తెలిపారు.

Next Story