ప్రభుత్వం వీటిని వెంటనే అమలు చేయాలి

by Naveena |

కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ పెట్టుబడి సహాయం రూ. 6 వేల నుంచి 18 వేలకు పెంచాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వం వీటిని వెంటనే అమలు చేయాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ పెట్టుబడి సహాయం రూ. 6 వేల నుంచి 18 వేలకు పెంచాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వచ్చిన రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్యపద్మ మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. కొనుగొల్ల కేంద్రాలను పెంచాలని, పండించిన పంటలకు ఇప్పటివరకు ఇస్తున్న గిట్టుబాటు ధరలను మరింతగా పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి సంధ్య , రాష్ట్ర కోశాధికారి డి.జి.నరేంద్ర ప్రసాద్ గారు, జిల్లా కార్యదర్శి నిమ్మల నర్సింలు, ఏ.బాపు రాజు, ఎన్ వెంకటేష్, డి.హెచ్పి. ఎస్ రాష్ట్ర నాయకులు సహదేవ్, చీర్ల దర్శన్ చీర్ల కౌసల్య చీల పద్మ నరసగారి కమలమ్మ, అక్కుల కలమ్మ, 35 మంది రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Next Story