- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉపాధ్యాయురాలు
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

దిశ , కాప్రా: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. కాప్రా డివిజన్ సాయిబాబా నగర్ కు చెందిన తాడెం వెన్నెల తాండూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన చేవెళ్ల మిర్జాపూర్ కంకర టిప్పర్ , ఆర్ టి సి బస్సు ప్రమాద ఘటనలో... వెన్నెల తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెన్నెలను బుధవారం కలిసి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయురాలు వెన్నెల కు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పునరావృత్తం కాకుండా రహదారి భద్రత చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాద బాధితురాలిని పరామర్శించిన వారిలో... స్థానిక నాయకులు బైరి నవీన్ గౌడ్, ప్రసాద్ గౌడ్, మధు, తదితరులు ఉన్నారు.






