- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందే తెలిసినా...డీసీ తప్పు చేసేశారు
సర్వే నెంబర్లు 573/2 నుంచి 6 వరకు, 574/2 నుంచి 6 వరకు 5 ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదం నడుస్తోంది. మామిడి జనార్దన్

దిశ, మేడ్చల్ బ్యూరో : అయ్యవారు ఏమి చేస్తున్నారంటే చేసిన తప్పులను లెక్క వేసుకుంటున్నట్లు ఉంది అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటి కమీషనర్ పరిస్థితి. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించి అడ్డంగా బుక్కైన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు అర్థమవుతోంది. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించడంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డినే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
కేసు కోర్టులో ఉన్నా....
అల్వాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 573/2 నుంచి 6 వరకు, 574/2 నుంచి 6 వరకు 5 ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదం నడుస్తోంది. మామిడి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భవన నిర్మాణ అనుమతులు, ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు బయటకు వచ్చిందట. దీంతో అల్వాల్ డిప్యూటీ కమీషనర్ కు 2023, జనవరి 25న వినతి పత్రం సర్వే నెంబర్ 573లో 3 ఎకరాల 24 గుంటల భూ యాజమానురాలు స్రవంతి భర్త నిమ్మ మోహన్ రెడ్డి అందజేశారు.
అదే విధంగా 2024, డిసెంబర్ 31 న కూడా డీసీకి రెండో సారి వినతి పత్రం అందజేశారు. అయితే కోర్టు లో భూ వివాదం నడుస్తున్నా.. స్టేటస్ కో ఉన్నప్పటికీ, అల్వాల్ మున్సిపల్ అధికారులు ఇవేమి లెక్క చేయకుండా.. కనీసం అక్కడ ఇండ్లు ఉన్నాయా.. ? లేదా..? అని పరిశీలించకుండానే ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లను కేటాయించేశారని సమాచారం. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు ఇచ్చినట్లు తెలుసుకున్న స్థల యాజమాని మోహన్ రెడ్డి... 2025, మే 26న ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మరోసారి వినతి పత్రం అందజేశారు. దీంతో ఎట్టకేలకు దరఖాస్తు దారుడు మామిడి జనార్దన్ రెడ్డికి 2025,మే,29న షోకాజ్ నోటీసు జారీ చేసి, మూడు రోజులలో సమాధానం ఇవ్వాలని కోరాడు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి.
ఈ తరుణంలో జనార్దన్ రెడ్డి అక్కడ పాత ఇండ్లు ఉన్నాయని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే జనార్దన్ రెడ్డికి ఆయా సర్వే నెంబర్లలో భూమి ఉందా..? అక్కడ పాత ఇండ్లు ఉన్నాయా..? అని మున్సిపల్ అధికారులు పరిశీలించకుండానే 4వేల చదరపు గజాల చొప్పున 10 ఇండ్లకు కలిపి మొత్తం ఒకే ఇంటి నెంబరు చొప్పున మొత్తం 80 ఇంటి నెంబర్లను కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే సర్కిల్ కార్యాలయంలోని లాగిన్ తో ఇంటి నెంబర్లను కేటాయిస్తే..విషయం బయటకు తెలిసే ప్రమాదం ఉందని, వేరే లాగిన్ తో ఇంటి నెంబర్లను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అధికారుల అత్యుత్సాహం...
సాధారణంగా సర్వే నెంబర్ లేని గ్రామకంఠం/ఆబాది పరిధిలోని పాత ఇళ్ల స్థలాలను ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇందుకోసం గతంలో 12 ఏళ్లకు పై బడిన పాత ఇంటి పన్నురికార్డు ఆధారంగా సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ఓనర్ షిప్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఓనర్ షిప్ సర్టిఫికేట్ జారీ నిలిపివేశారు. అయినా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, సెల్ఫ్ అఫిడవిట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇదే అదునుగా మామిడి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధికారులను ప్రలోభ పెట్టి ఖాళీ జాగకు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం నుంచి 80 ఇంటి నెంబర్లను అక్రమంగా పొందినట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఆధారంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారం ఎక్కువగా అసైన్డ్, సీలింగ్, సర్కార్ భూముల్లోనే జరుగుతోంది. ఇదే హౌస్ ట్యాక్స్ , ఆ ఇంటి నెంబర్ మీద తీసుకున్న ఎలక్ట్రిసిటీ బిల్లును ఆధారంగా చూపి 58,59 జీవోల కింద రెగ్యులరైజేషన్ చేయించుకోవాలని జనార్దన్ రెడ్డి స్కెచ్ వేసినట్లు సమాచారం. అయితే నిమ్మ మోహన్ రెడ్డి సతీమణి స్రవంతికి చెందిన పట్టా ల్యాండ్స్ లోనూ సాగుతున్న ఇదే వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.






