కీసరలో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం

by Naveena |

శ్రీ రామనవమి పురస్కరించుకొని కీసర శ్రీ సీత రామాలయ మండపంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవో పేతంగా నిర్వహించారు.

కీసరలో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం
X

దిశ,కీసర : శ్రీ రామనవమి పురస్కరించుకొని కీసర శ్రీ సీత రామాలయ మండపంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవో పేతంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నాయకపు వెంకటేష్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ వేడుకలు చూసేందుకు కీసర ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. తదనంతరం వడపప్పు పానకాన్ని స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఛైర్మన్ రామిడీ ప్రభాకర్ రెడ్డి,కీసర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్ కుమార్ రెడ్డి,గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు జూపల్లి రవీందర్,మిట్టపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

Next Story